పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఏపి ఎలక్షన్స్ తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఇదవరకు అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ తో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరన్న్నది మాత్రం ఇంకా తెలియలేదు. 

అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలపై తన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సంతోష్ శ్రీనివాస్ తో చేయాల్సిన సినిమా ఆగిపోగా కిశోర్ కుమార్ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా మైత్రి ప్రొడక్షన్ లో పవన్ సినిమా చేయడం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా కోసం పవన్ 40 రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకు రెమ్యునరేషన్ గా 30 కోట్ల దాకా తీసుకుంటున్నారట. అయితే మే 23 ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి తర్వాత సినిమాల సెలక్షన్ ఉంటుందని తెలుస్తుంది.