
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ట్రైలర్ లో నరేష్ కు రెండు సీన్స్ మాత్రమే ఇచ్చినా సినిమాలో అతని పాత్రకు చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నరేష్ సీరియస్ రోల్ చేశాడు. కచ్చితంగా మహర్షి తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని చెబుతున్నాడు నరేష్.
కొన్నాళ్లుగా సోలో సినిమాలు చేస్తున్నా హిట్టు దక్కని నరేష్ మహర్షితో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. వంశీ పైడిపల్లి ఇంత పవర్ ఫుల్ రోల్ కు తనని సెలెక్ట్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నా అని అంటున్నాడు నరేష్. మరి నరేష్ కోరుకునే సూపర్ హిట్ మహర్షి ద్వారా దక్కుతుందా లేదా అన్నది చూడాలి. మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు చిత్రయూనిట్.