
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ సెట్స్ మీద ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించగా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి సినిమానే ప్రయోగాత్మకంగా ఉండాలని మూగ వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడట వైష్ణవ్ తేజ్. సినిమాలో అతని పాత్ర కూడా జాలరిగా కనిపిస్తుందట. అందుకే ఈమధ్య ఈ సినిమా పేరు జాలరి అని పెట్టబోతున్నారని అనుకున్నారు. కాని నిర్మాణ సంస్థ మాత్రం వైష్ణవ్ తేజ్ సినిమాకు ఉప్పెన అని టైటిల్ ఫిక్స్ చేశారట.
ఉప్పెన టైటిల్ తోనే ఓ క్రేజీ ఫీల్ వచ్చేలా చేశారు. సినిమా కూడా డిఫరెంట్ లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో వైష్ణవ్ తేజ్ నటనకు అందరు షాక్ అవుతారట. ఈమధ్యనే సాయి ధరం తేజ్ కూడా చిత్రలహరితో పర్వాలేదు అనిపించాడు. మరి అన్న దారిలో కాకుండా మొదటి సినిమానే కొత్తగా ట్రై చేస్తున్న వైష్ణవ్ తేజ్ కచ్చితంగా హీరోగా నిలబడతాడనే అనిపిస్తుంది. సినిమా మొదలైన రోజే ఓ క్రేజీ పోస్టర్ వదలగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.