
విక్టరీ వెంకటేష్ మరో సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయబోతున్నాడు.. అదికూడా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఎఫ్-2తో మల్టీస్టారర్ హిట్ కొట్టిన వెంకటేష్, వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాగ చైతన్యతో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా.. లేటెస్ట్ గా తమిళ సూపర్ హిట్ మూవీ విక్రం వేద రీమేక్ గా తెలుగులో వెంకటేష్, నారా రోహిత్ లు ఫిక్స్ అయ్యారు. ఈ రీమేక్ ను వినాయక్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. వెంకటేష్, నారా రోహిత్ అసలు ఎవరు ఊహించని ఈ కాంబినేషన్ సెట్స్ చేశారు.
తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన విక్రం వేద సినిమా సూపర్ హిట్ అందుకుంది. సినిమాలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా నటించారు. నారా హీరో రోహిత్ అప్పట్లో వరుస సినిమాలు చేసినా ఈమధ్య కాస్త వెనుకపడ్డాడు. మరి ఈ రీమేక్ తో అయినా నారా రోహిత్ కు కమర్షియల్ హిట్ పడుతుందేమో చూడాలి. ఎఫ్-2 సినిమాతో వెంకటేష్ మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చాడని చెప్పొచ్చు. వెంకీమామ కూడా హిట్టైతే ఇక వెంకటేష్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేయాల్సి ఉంటుంది.