క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇంట విషాదం..!

టివి సీరియల్స్ తో కెరియర్ మొదలుపెట్టి సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సురేఖా వాణి ఇంట విషాదం జరిగింది.  సురేఖా వాణి భర్త సురేష్ తేజ సోమవారం తుదిశ్వాస విడిచారు. టివి సీరియల్స్ లో ఆయన డైరక్టర్ గా పనిచేశారు.. ఓ ప్రముఖ ఛానెల్ లో క్రియేటివ్ హెడ్ గా కూడా సురేష్ తేజ్ పనిచేశారు.  అక్కడే సురేఖా వాణితో పరిచయం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో బిజీ అయ్యాక సురేఖా వాణి బుల్లితెర మీద పెద్దగా కనిపించ లేదు. కొన్నాళ్లుగా సురేఖా వాణి భర్త సురేష్ తేజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తుంది.    

యాంకర్ గా మొదలుపెట్టి మంచి నటిగా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్న సురేఖా వాణి భర్త  మరణంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.  . ఈ వార్త తెలిసిన సిని ప్రముఖులు సురేఖా వాణి కుటుంబానికి సానుభూతి తెలియచేస్తున్నారు. సురేఖా వాణికి ఒక కూతురు ఉంది. సురేష్ తేజ మరణించాడికి అనారోగ్యమే కారణమా.. ఎలాంటి జబ్బు వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు అన్న విషయాలపై పూర్తి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.