త్రివిక్రం 2000 కోట్ల బడ్జెట్ కథ ఏంటి..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం తన పెన్ పవర్ తో చేసే మ్యాజిక్ అందరికి తెలిసిందే. అజ్ఞాతవాసితో కొద్దిగా వెనుకపడ్డ త్రివిక్రం ఎన్.టి.ఆర్ అరవింద సమేత హిట్ అవడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. త్రివిక్రం స్నేహితుడైన సునీల్ త్రివిక్రం దగ్గర 2000 కోట్ల బడ్జెట్ కథ ఉందని చెప్పాడు. సినిమా అవకాశాల కోసం వెతికే టైంలో సునీల్, త్రివిక్రం ఇద్దరు కలిసి ఒకే రూం లో ఉండేవారు.

అందుకే హీరోగా ఫ్లాప్ అయిన సునీల్ కు మళ్లీ కమెడియన్ గా వరుస అవకాశాలు ఇస్తున్నాడు త్రివిక్రం. ఇదిలాఉంటే త్రివిక్రం దగ్గర ఓ అద్భుతమైన కథ ఉందని అప్పట్లో దాని బడ్జెట్ 500 కోట్లు అవుతుందని చెప్పాడు. కాని ఇప్పుడు ఆ సినిమా తీయాలంటే 2000 కోట్లు అవుతుందని అన్నాడు. మరి త్రివిక్రం ను నమ్మి 2000 కోట్ల సాహసం ఎవరు చేస్తారో చూడాలి. ఇంతకీ 2000 కోట్ల బడ్జెట్ సినిమా అంటే కచ్చితంగా యూనివర్సల్ కాన్సెప్ట్ అయ్యుండాలి. మరి బడ్జెట్టే 2000 కోట్లయితే ఆ సినిమా బిజినెస్.. కలక్షన్స్ ఇంకెన్ని రాబట్టాలో.. మొత్తానికి త్రివిక్రం భారీ బడ్జెట్ డ్రీం ప్రాజెక్ట్ ను బయటపెట్టాడు సునీల్.