మహేష్ మహర్షి సెన్సార్ పూర్తి

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి సినిమా సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. స్టార్ హీరోల సినిమాలు ఈమధ్య స్ట్రాంగ్ కంటెంట్ బేస్ తో వస్తున్నాయి.

వంశీ పైడిపల్లి కూడా మహర్షి సినిమాను అదేవిధంగా తెరకెక్కించారు. సినిమాలో మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేయగా తప్పకుండా మహర్షి మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా మారుతుందని అంటున్నారు. ఈ సినిమా చూసి సెన్సార్ టీం కూడా చిత్రయూనిట్ ను ప్రశంసించిందని తెలుస్తుంది.