
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. రీసెంట్ గా అజయ్ దేవగన్ తో దే దే ప్యార్ దే సినిమాలో నటించిన రకుల్ ఆ సినిమా అందాల విందు ప్రదర్శించింది. బాలీవుడ్ ఆడియెన్స్ కు ఆమాత్రం చూపించకపోతే బాగోదు అనుకుందో ఏమో అమ్మడు తెలుగులో ఇన్ని సినిమాలు చేసినా దాచిన అందాలను అక్కడ బహిర్గతం చేసింది.
ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో లాగా వయసు ముదిరిన వ్యక్తిని ప్రేమిస్తారా అంటే మనసుకి నచ్చిన వ్యక్తి ఎవరైనా నాకు ఓకే అంటుంది రకుల్. తన మనసుకి నచ్చితే అది ఏజ్డ్ ఆర్ యంగ్ అని చూడనని.. అయితే ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అలాంటి వారి కోసం వెతుకుతా అంటుంది. అంటే దే దే ప్యార్ దే లాగే వయసు ముదిరిన వారైనా నాకు ఓకే అంటుంది రకుల్. మొత్తానికి కెరియర్ వెనుకపడ్డట్టు అనిపించగానే పెళ్లిపై అమ్మడి గాలి మళ్లినట్టుంది.