
మాస్ మహరాజ్ రవితేజకు బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు గ్యాప్ ఇచ్చి చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా అనే మూవీ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. టైటిల్ పోస్టర్ వదిలి హంగామా చేసిన ఈ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. డైరక్టర్ ఆనంద్ రవితేజ మార్కెట్ ను మించి బడ్జెట్ లెక్కలు వేశాడట.
అయితే ప్రస్తుతం మాస్ రాజా మార్కెట్ డల్ గా ఉన్న కారణంతో అంత బడ్జెట్ కష్టమని నిర్మాత అన్నాడట. అందుకే కాస్ట్ కటింగ్ అంటూ స్టార్ హీరోయిన్స్ బదులుగా కొత్త వారిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు అవసరమైతే సినిమాలో సాంగ్స్ కూడా లేకుండా చేయాలని చూస్తున్నారట. రవితేజ సినిమా అంటేనే క్లాసు మాసు మిక్స్ చేసి వచ్చే సాంగ్సే హైలెట్ అలాంటిది సాంగ్స్ లేకుండా సినిమా ఎలా అంటున్నారు ఫ్యాన్స్. చూస్తుంటే రవితేజ డిస్కో రాజా కూడా అటకెక్కేలా ఉందని ఫిల్మ్ నగర్ టాక్.