
సూపర్ స్టార్ రజినికాంత్ 167వ సినిమాగా వస్తున్న దర్భార్ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగించారు అక్కడ స్టూడెంట్స్. మురుగదాస్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఓ కాలేజ్ సెట్ లో జరుపుకుంటుంది. అయితే ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న రజినిని చూసేందుకు అక్కడ స్టూడెంట్స్ ప్రయత్నించగా.. చిత్రయూనిట్ వారిని కట్టడి చేయడంతో వెంటనే షూటింగ్ పై రాళ్లదాడి చేశారు. పోనీలే అని చూసేందుకు పంపిస్తే లొకేషన్ ఫోటోలు.. రజిని పిక్స్ లీక్ చేస్తున్నారని వారిని కట్టడి చేయడం జరిగింది. అయితే దానితో వారు ఏకంగా సెట్స్ మీదే రాళ్లదాడి చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి కంట్రోల్ అయ్యిందని తెలుస్తుంది.
దర్శకుడు మురుగదాస్ చిత్రయూనిట్ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. షూటింగ్ క్యాన్సిల్ చేసి క్రౌడ్ అంతా సెట్ రైట్ అయిన తర్వాత మళ్లీ షూటింగ్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అవసరమైతే లొకేషన్ చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రజిని, మురుగదాస్ మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కీర్తి సురేష్, నయనతార ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.