
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. సినిమా కోసం కోకా పేటలోని చిరంజీవి ఫాం హౌజ్ లో ఓ భారీ సెట్ వేశారు. అయితే ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల సైరా సెట్ మొత్తం కాలి బూడిదైందట. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తుంది.
అయితే యూనిట్ లో ఎవరికి ఏమి అవ్వలేదట.. అయితే సుమారు 2 కోట్ల దాకా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. గురువారం రాత్రి వరకు సినిమా షూటింగ్ జరుపగా ఈరోజు ఆ సెట్ బూడిదపాలైంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.