మహర్షి క్లైమాక్స్ పై అంచనాలు పెంచేస్తున్నారు..!

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ట్రైలర్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్న రిషి ప్రయాణం ఎలా సాగింది అన్నది మహర్షి కథ. సినిమాలో మహేష్ ఒక్కడే మూడు వేరియేషన్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఓ సీరియస్ రోల్ చేశాడని తెలిసిందే. 

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. సినిమా క్లైమాక్స్ చూసి డిఎస్పి నోట మాటరాలేదని అన్నాడు. మరి అంతగా ఆ క్లైమాక్స్ లో ఏముంటుంది అన్నది తెలియాల్సి ఉంది. మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న మహర్షి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది.