
మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ తనని డైరెక్ట్ చేసిన డైరక్టర్స్ కొందరి పేర్లని ప్రస్థావించిన విషయం తెలిసిందే. రాజకుమారుడు సినిమా నుండి మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి వరకు మహేష్ ప్రస్థావించాడు. అయితే వాటిలో పోకిరి సినిమా.. డైరక్టర్ పూరి జగన్నాథ్ ను మర్చిపోయాడు మహేష్. ఈవెంట్ లో హడావిడి అవడం వల్ల మర్చిపోయాడనుకోగా వెంటనే పోకిరిని మర్చిపోయానని గుర్తించిన మహేష్ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు.
తనని సూపర్ స్టార్ ను చేసిన సినిమా పోకిరి.. సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కు థ్యాంక్స్ అని పెట్టాడు. అయితే స్టేజ్ మీద చెప్పాల్సిన విషయాన్ని ఇలా ట్విట్టర్ లో చెబుతారా అంటూ పూరి ఫీల్ అవుతాడని అనుకున్నారు అంతా కాని ఆ ట్వీట్ కు రిప్లై గా పూరి కూడా చాలా థ్యాంక్స్ సార్.. ఎప్పటికి మీరంటే ఇష్టం.. మహర్షి ట్రైలర్ అదిరిపోయింది అని రిప్లై ఇచ్చాడు. మధ్యలో పోకిరి ఫ్యాన్స్ గొడవ ఎక్కువైంది కాని మహేష్, పూరిల మధ్య రిలేషన్ మాత్రం అలానే ఉంది.