నాన్నతో గొడవలా.. అలాంటిదేమి లేదే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అయితే రీసెంట్ గా బన్ని ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా విషయాల గురించి ప్రస్థావించిన అల్లు అర్జున్ తన తండ్రితో తనకు గొడవలన్న విషయంపై కూడా ప్రస్థావించారు.

నాన్నతో నాకు గొడవలైనట్టు.. అందుకే తను వేరే ఆఫీస్ ఓపెన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికి మేమంతా కలిసే ఉంటున్నాం.. అంతేకాదు ఆయన, నేను ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒకసారైనా కలుస్తానని అన్నాడు బన్ని. నానతో తనకు గొడవైలనట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నాడు బన్ని. త్రివిక్రం సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేస్తున్నాడు బన్ని.