మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమా ఈ నెల 9న రిలీజ్ అవనుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరిగింది.

ఈవెంట్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రావడం విశేషం. ఇక వెంకీతో పాటుగా యువ హీరో విజయ్ దేవరకొండ కూడా అటెండ్ అయ్యాడు. ఈవెంట్ లో భాగంగా సినిమాపై అందరు తమ అభిప్రాయాలను తెలిపారు. వెంకటేష్ అయితే మే 9న మహేష్ ఫ్యాన్స్ కు పండుగ అని.. సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. సీతమ్మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పూల కుండి తన్ని రికార్డులు బద్ధలు కొట్టినట్టుగా ఈ సినిమా కూడా రికార్డులను తన్నేలా ఉండాలని అన్నారు వెంకటేష్.

విజయ్ కూడా మహేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీమంతుడు టైంలో మహేష్ ను చూసి అందరు లేచి గ్రీట్ చేస్తున్నారు. అది రా లైఫ్ అంటే అనుకున్నానని.. మహేష్ బాబు సినిమా టికెట్స్ కోసం కోణార్క్ థియేటర్ దగ్గర చాలా కష్టపడ్డానని అన్నాడు విజయ్. హీరో కాకముందు మహేష్ బాబు అని అనేవాడిని.. ఇప్పుడు తాను హీరో అయ్యాక మహేష్ బాబు సర్ అని పిలవాల్సి వస్తుందని అన్నాడు విజయ్.

ఇక మహేష్ కూడా 25 సినిమాలకు పనిచేసిన దర్శకుల పేర్లు ప్రస్థావించాడు. రాఘవేంద్ర రావు దగ్గర నుండి 25వ సినిమా వంశీ పైడిపల్లి గురించి మహేష్ మాట్లాడారు. ఈ సినిమా కథ 10 నిమిషాలు విని వంశీని వెళ్లిపోమని చెబుదామనుకున్నా కాని కథ విని లాక్ అయిపోయానని.. ఇక సినిమా కోసం దాదాపు 2, 3 ఏళ్లు వంశీ వెయిట్ చేశాడని. మరో దర్శకుడు అయితే రెండు మూడు నెలలకే మరో హీరో దగ్గరకు వెళ్తాడని అన్నారు. మొత్తానికి మహేష్ మహర్షి మే 9న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.