
నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అయిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నాని నటన, డైరక్టర్ ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పారు. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న ఈ సినిమా చూసి స్వీటీ అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ జెర్సీపై అనుష్క కామెంట్స్ ఏంటి అంటే..
నా అనుభూతి వర్ణించే మాటలు ఉంటే బాగుండు :
జెర్సీ సినిమా చూశాక అనుష్క తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఏంటంటే.. సినిమాలో మ్యాచ్ చూశాక.. నా అనుభూతిని వర్ణించడానికి మాటలు ఉంటే బాగుండేదనిపిస్తుంది.. నిజంగా ఇది నాకు ఫ్యాన్ మూమెంట్.. ఇలాంటి అద్భుతమైన సినిమా అందించిన నానికి, డైరక్టర్ గౌతం కు, మూవీ యూనిట్ కు ధన్యవాదాలు అంటూ అనుష్క మెసేజ్ పెట్టింది.