రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు

శుక్రవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలుకాబోతున్నాయి. జనవరి 5 వరకు కొనసాగబోయే ఈ సమావేశాలలో మొత్తం 14 పనిదినాలు ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ముగిసి వాటి ఫలితాలు వెలువడే సమయంలో ఈ సమావేశాలు జరుగబోతున్నాయి కనుక వాటిలో విజేతలైన పార్టీలు సహజంగానే ఈ సమావేశాలలో రెచ్చిపోవచ్చు. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం ఈ సమావేశాలలో కనిపించవచ్చు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలుకాబోతునందున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆనవాయితీ ప్రకారం సభ్యులందరికీ సమావేశాలలో పాల్గోనవలసిందిగా కోరుతూ ఆహ్వానాలు పంపించింది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం సాయంత్రం అన్ని పార్టీల ప్రతినిధులకు డిల్లీలో తేనీటి విందునిచ్చి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించవలసిందిగా కోరతారు.