తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఇదే...

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న బీసీల కోసం ప్రత్యేకంగా ఓ పార్టీని పెడతానని చెపుతూనే ఉన్నారు. చెప్పినట్లుగానే నేడు ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని ప్రకటించారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో  జరిగిన ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న పార్టీ నేతలతో కలిసి ఎరుపు, పచ్చరంగులతో రూపొందించిన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, “అన్ని పార్టీలకు బీసీలు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. కానీ బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో మా పార్టీని ఏర్పాటు చేశాము,” అని చెప్పారు.

ఇదివరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ బీఎస్పీలో చేరి ‘దళితులకు రాజ్యాధికారం’ ఇప్పిస్తానంటూ తిరిగారు. కానీ దళితులు నమ్మలేదు. అలాగే  కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకున్నారు. కానీ ఆయనని ఎవరూ పట్టించుకోలేదు. కనుక తీన్మార్ మల్లన్న పార్టీని బీసీలు పట్టించుకుంటారా లేదా? రాబోయే రోజుల్లో తెలుస్తుంది.