తెలంగాణకు రూ.200కోట్ల పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి తాజాగా రూ.200 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఎల్ఈడీ టీవీలు, మైక్రో ఎల్ఈడీలు, ఆడియో మరియు వీడియో రంగానికి సంబంధించి వివిధ పరికరాలు తయారుచేస్తున్న పిక్సియమ్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. 

దీనిలో భాగంగా పిక్సియమ్‌ కంపెనీ తొలిదశలో రూ.200-250 కోట్ల పెట్టుబడితో ఎల్ఈడీ టీవీలు, ఆడియో, వీడియో పరికరాల తయారుచేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా వంద మందికి ఉద్యోగాలు, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి లభించనున్నాయి.

మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత మరో వంద కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడుతుంది. అది కూడా పూర్తయితే మొత్తం 5,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీకి శేరిలింగంపల్లిలో కార్యాలయం ఉంది.