హైదరాబాద్ నగరంలో వివిద ప్రాంతాల నుంచి పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెళ్ళి వాహనదారులు నిత్యం రసూల్‌పురా చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక వర్షాలు పడితే వారి కష్టాలు మరింత పెరుగుతుంటాయి.
ఈ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా రసూల్‌పురా వద్ద రూ.150 కోట్లు వ్యయంతో ఓ ఫ్లై ఓవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.80 కోట్లు మిగిలింది భూసేకరణకి కేటాయించింది. దీని కోసం సర్వే, డిజైనింగ్, సమగ్ర నివేదికల కోసం టెండర్లు పిలిచింది.
హెచ్ఎంఆర్ఎల్ బిల్డింగ్ ఉత్తరం వైపు నుంచి ‘వై’ ఆకారంలో అప్రోచ్ రోడ్ ప్రారంభించి మినిస్టర్ రోడ్, పాటిగడ్డ రోడ్ వైపు రెండుగా విడిపోతుంది. 14 మీటర్ల వెడల్పు, 4లేన్లుతో దీనిని నిర్మించాలని భావిస్తోంది.
దీనిలో మినిస్టర్ రోడ్ వైపు వెళ్ళేవైపు క్యారేజ్ వే 11 మీటర్లు వెడల్పుతో మూడు లేన్లు, పాటిగడ్డవైపు వెళ్ళే క్యారేజ్ వే 7.5 మీటర్లు వెడల్పుతో రెండు లేన్లు ఉంటాయి.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా ఇంజనీరింగ్ ప్రోక్యూర్ మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ విధానం నిర్మించబోతోంది.
దీని నిర్మాణ పనులు 2027, డిసెంబర్‌లోగా పూర్తిచేయాలనిలక్ష్యంగా పెట్టుకొని పనులు మొదలు పెట్టబోతోంది.