షిరిడి వెళ్లనున్న సిఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం షిరిడిలోని సాయినాధుని దర్శించుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరివెళ్ళి రాత్రి అక్కడే బసచేసి రేపు తెల్లవారుజామునే షిరిడిసాయి దర్శనం చేసుకొంటారని సమాచారం. సిఎం షిరిడి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.