మహాభారత కాలంనాటికే భారత్ లో ఇంటర్నెట్ ఉందిట!

అవును. ఇంటర్నెట్ కొత్తగా కనుగొన్నది కాదు. మహాభారత కాలంనాటికే భారతదేశంలో ఉందిట! "ఇంటర్నెట్ ఉంది కనుక శాటిలైట్ సిస్టం కూడా ఉండే ఉంటుంది. ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది కనుకనే కురుక్షేత్ర సంగ్రామం గురించి సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కన హస్తినలో కూర్చొని వివరించగలిగాడు.” 

చాగంటి వంటి ప్రవచకులు ఏదో పురాణపటనంలో ఇటువంటి విషయాలు చెపితే ఎవరూ తప్పు పట్టరు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగసభలో అంటేనే అది ‘వార్త’ అవుతుంది. త్రిపుర ముఖ్యమంత్రిగా మార్చి నెలలో బాధ్యతలు చేపట్టిన బిప్లాబ్ దేవ్ అగర్తలా పట్టణంలో గల ప్రజ్ఞాభవన్ లో ‘కంప్యూటరైజేషన్ అండ్ రిఫార్మ్స్’ అనే అంశంపై జరిగిన సదస్సులో తను కనుగొన్న తను కనుగొన్న ఈవిషయం చెప్పారు. మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలలో భారతీయులే ఎక్కువగా పనిచేస్తున్నారని కనుక నేటికీ ఐటి, సాఫ్ట్ వేర్ రంగాలలో భారతీయులదే పైచెయ్యి అని అన్నారు.