సిపిఎం 22వ మహాసభలు బుధవారం నుంచి హైదరాబాద్ ఆర్టీసి కళ్యాణమండపంలో మొదలుకాబోతున్నాయి. ఐదు రోజులపాటు సాగే ఈ మహాసభలలో దేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఇంకా బివి రాఘవులు, ప్రకాష్ కారత్, బృందా కారత్, తమ్మినేని వీరభద్రం, పి.మధు, తదితరులు అనేకమంది సిపిఎం నేతలు పాల్గొనబోతున్నారు.
సిపిఎం సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం జెండా అవిష్కరణతో ప్రారంభం అయ్యే ఈ మహాసభలలో సీతారం ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులపై ఈ మహాసభలలో లోతుగా చర్చించి, వాటి ఆధారంగా తమ పార్టీ భవిష్యకార్యాచరణను నిర్ణయిస్తారు. కాంగ్రెస్, భాజపాలతో ఎటువంటి పొత్తులు పెట్టుకోకూడదని నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు ఈ మహాసభలలో కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీన హైదరాబాద్ లో జరిగే బారీ బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయి.