తెలంగాణా రాష్ట్రం ఏర్పడక మునుపు సాగునీటి రంగంలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన వ్యక్తి ఆర్. విద్యాసాగర్ రావు. తెలంగాణా ఏర్పడితే రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను ఏవిధంగా సమర్ధంగా ఉపయోగించుకొవచ్చో తెలిపిన వ్యక్తి ఆయన. సాగునీటిశాఖ అధ్యర్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రూపకల్పనలో అయన పాత్ర ఉంది. అయన పేరు ప్రస్తావించకుండా రాష్ట్రంలో సాగునీరు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోలేమని చెప్పవచ్చు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ ఎకరానికి నీళ్ళు పారించి సస్యస్యామలం చేయాలని అయన కలలు కంటుండేవారు.
అయన కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, అయన గౌరవార్ధం నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టుకు అయన పేరును ఖరారు చేశారు. అయన నల్గొండ జిల్లాకు చెందినవారు కనుక ఆ జిల్లాలో చేపడుతున్న డిండి ఎత్తిపోతల పధకానికి అయన పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫెయిల్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సంతకం చేశారు. తద్వారా ఆర్. విద్యాసాగర్ రావు పేరు చరిత్రలో శాస్వితంగా నిలిచిపోయేలా చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్. అందుకు ఆయనకు అభినందనలు.
తెలంగాణా రాష్ట్రం సశ్యశ్యామలం కావాలని తపించిపోయిన ఆ మహనీయుడు రాష్ట్రంలో నిర్మితమవుతున్న అనేక ప్రాజెక్టులను కళ్ళారా చూడకుండానే గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూశారు.