ఆ మెట్రో స్టేషన్ పేరు మారింది

కూకట్ పల్లి వైకాపా జంక్షన్ వద్ద నిర్మించిన బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ పేరు మారింది. దళిత సంఘాలు, ప్రజా ప్రతినిధుల అభ్యర్ధన మేరకు ఆ స్టేషన్ కు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు హైదరాబాద్ మెట్రో సంస్థ ఆ మెట్రో స్టేషన్ మార్చింది. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ స్టేషన్ పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ గా మార్చింది.