సంబంధిత వార్తలు
బొగ్గు ఉత్పత్తిలో, కార్మికుల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది సింగరేణి. సింగరేణి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆ సంస్థ సిఎండి శ్రీధర్ ప్రతిష్టాత్మకమైన ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెనన్యూర్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ అవార్డును అందుకొన్నారు కానీ బొగ్గు ఉత్పత్తి సంస్థల నుంచి ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకొంటున్న మొట్టమొదటి వ్యక్తి శ్రీధర్. రేపు అంటే శుక్రవారం డిల్లీలో ఈ అవార్డును అందుకోబోతున్నారు.