టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటవుతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్) ఆవిర్భావ సభ ఏప్రిల్ 29న నిర్వహించాలని టిజెఎసి నేతలు నిర్ణయించినట్లు తాజా సమాచారం. పైన నీలం, క్రిందన ఆకుపచ్చ రంగులతో ఉండే జెండా మద్య భాగాన్న అమరవీరుల స్థూపం బొమ్మ ఉంటుందని తెలుస్తోంది. నీలం రంగు సామాజిక తెలంగాణాకు, ఆకుపచ్చ రంగు రైతు సంక్షేమానికి చిహ్నాలు. పార్టీ రిజిస్ట్రేషన్ కు సబందించి కేంద్ర ఎన్నికల కమీషన్ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వెలువడకపోవడంతో ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ పేరును ప్రకటించి, జెండాను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4వ తేదీన పార్టీ ఆవిష్కారసభ పోస్టర్ విడుదలచేయబోతున్నట్లు సమాచారం.