హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్!

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులను మత్తుమందుల కేసులలో గత ఏడాది ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించడం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. నగరంలో మత్తుమందుల సరఫరా చేస్తున్న ముఠాలలో ముఖ్యమైన వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి వారిచ్చిన సమాచారం ఆధారంగా సినీ పరిశ్రమ లో వ్యక్తులను, నగరంలోని కొన్ని పబ్ లకు నోటీసులు పంపించి విచారణ జరిపారు. కానీ ఆ తరువాత ఆ కేసులన్నీ అటకెక్కిపోవడంతో దాని గురించి అందరూ మరిచిపోయారు. కానీ అంతమాత్రన్న హైదరాబాద్ నగరంలో మత్తుమందుల సరఫరా నిలిచిపోలేదని తాజాగా సనత్ నగర్ లో బారీ స్థాయిలో పట్టుబడిన మత్తుమందులు నిరూపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు సనత్ నగర్ లోని గాయత్రి నగర్ లో సోదాలు నిర్వహించగా బారీగా హెరాయిన్, కొకైన్ పట్టుబడ్డాయి. వాటిని అక్రమరవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను కూడా వారు అదుపులోకి తీసుకొన్నారు.