రాజ్యసభ ఎన్నికలలో వారే గెలిచారు

ఈరోజు జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ముందు ఊహించినట్లుగానే తెరాస తరపున పోటీ చేసిన జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్‌ ముగ్గురూ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధి పి.బలరాంనాయక్‌ కు కేవలం 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

రాష్ట్రంలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 108 మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. భాజపా (5), తెదేపా (2), సిపిఎం (1) ఎమ్మెల్యేలు ఓటింగ్ ను బహిష్కరించారు. ఒక స్వతంత్ర అభ్యర్ధి మాధవ్ రెడ్డి కాంగ్రెస్ ఏజంట్ కు పోలింగ్ పత్రం చూపించినందున ఆయన ఓటును రద్దు చేయాలని తెరాస నేతలు ఎన్నికల అధికారిని కోరారు.