మాదాపూర్ లో భారీ అగ్నిప్రమాదం

మాదాపూర్ లోని సైబర్ టవర్స్ కు సమీపంలో గల పత్రికానగర్ లో గురువారం ఉదయం బారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 150 గుడిసెలు, వాటిలో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో అందరూ కూలి పనులకు వెళ్ళిపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. సమాచారం అందుకొన్న వెంటనే మూడు ఫైర్ ఇంజన్లలో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో ఆంధ్రా, తెలంగాణా, ఓడిశా, యూపి, బిహార్ రాష్ట్రాల నుంచి వచ్చినవారు నివసిస్తున్నారు. అగ్నిప్రమాదం సంగతి తెలుసుకొని వారందరూ పరుగున అక్కడకు చేరుకొని, కాలి బూడిదైన తమ ఇళ్ళను, వస్తువులను చూసి బోరున విలపిస్తున్నారు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు అక్కడకు వచ్చి భాధితులను ఆదుకొంటామని భరోసా ఇచ్చారు.