ఇద్దరు చంద్రులు మళ్ళీ చేతులు కలుపుతారా?

కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనపై ఉత్తరాది రాష్ట్రాల నేతలు కూడా స్పందిస్తున్నారు కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించకపోవడం ఆశ్చర్యమే. బహుశః ఈవిషయంలో కాస్త ఆచితూచి అడుగు ముందుకు వేయాలని అగారేమో? 

తెలంగాణాలో తన పార్టీని కాపాడుకోవడానికి వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడోరేపో భాజపాతో తెగతెంపులకు సిద్దమవుతున్నందున చంద్రబాబు కూడా కెసిఆర్ కు మద్దతు పలుకవచ్చు. గతంలో జాతీయ రాజకీయాలలో వెనుక నుంచి చక్రం తిప్పారు కనుక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో అయన సహకారం కెసిఆర్ కు చాలా అవసరమే కనుక భవిష్యత్ లో వారిరువురూ చేతులు కలుపవచ్చు. ఒకవేళ ఇద్దరు చంద్రులు మళ్ళీ చేతులు కలిపినట్లయితే, చకచకా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది. వచ్చే ఎన్నికలలో అది కాంగ్రెస్, భాజపాలకు గట్టిపోటీ ఈయవచ్చు.