కమల్ హాసన్ ఎంట్రీపై కేటిఆర్ కామెంట్స్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈరోజు సాయంత్రం మదురైలో నిర్వహించబోయే బారీ బహిరంగ సభలో తన రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్నారు. ఆ సభకు దేశంలో  పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో మంత్రి కేటిఆర్ కూడా ఒకరు. ఈవిషయం కేటిఆర్ స్వయంగా దృవీకరించారు. తనను ఆ సభకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “ఆ సభలో నేను స్వయంగా పాల్గొనలేకపోయినా, మీ నూతన ప్రస్తానం విజయవంతం కావాలని నిజ జీవితంలో కూడా ‘నాయకన్’ లాగ రాణించాలని కోరుకొంటున్నానని” కేటిఆర్ ట్వీట్ చేశారు.