డిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయం కోసం 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సువిశాలమైన బహుళ అంతస్తుల భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. డిల్లీలోని దీన్ దయాళ్ ఉపాద్యాయ్ మార్గ్ లో నిర్మించబడిన ఈ భవనానికి 2016, ఆగస్ట్ 16న ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేశారు. కేవలం 18 నెలల వ్యవధిలోనే ఈ భవన నిర్మాణం పూర్తవడం విశేషం. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ తదితర కేంద్రమంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి మొదలైన సీనియర్ నేతలు హాజరయ్యారు.
ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల కంటే ఈ భవనం చాలా పెద్దది. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉంది. దీనికి దేశంలో అన్ని రాష్ట్రాల భాజపా శాఖల కార్యాలయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయి. కనుక అక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ నేతలతోనైనా నేరుగా సమావేశాలు నిర్వహించవచ్చు.
డిల్లీలో భాజపా నూతన ప్రధాన కార్యాలయం ఫోటోలు: