సంబంధిత వార్తలు
వరంగల్ ఉభయ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలి వివాహం జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన సమీర్ శర్మతో ఆదివారం ఆ రాష్ట్రంలోనే జరుగబోతోంది. 2011 బ్యాచ్ ఐపిఎస్ కు చెందిన అయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డమన్ & డియులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్నారు. వివాహానంతరం వారు ఈనెల 23న వరంగల్ లో, 25న హైదరాబాద్ లో బంధుమిత్రులకు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు రిసప్షన్ పార్టీ ఇస్తారు. ఆ తరువాత నూతన దంపతులు కొంతకాలం విదేశాలకు హనీమూన్ వెళతారని సమాచారం.