గత ఏడాది నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాని తరువాత అమీర్ పేట్-ఎల్.బి.నగర్, అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్స్ పనులు పూర్తిచేసి ఆ మార్గాలలో కూడా మెట్రో రైల్ సర్వీసు లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎల్ & టి సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఏప్రిల్ నాటికి అమీర్ పేట్-ఎల్.బి.నగర్ కారిడార్ లో నిర్మాణపనులన్నీ పూర్తిచేసి ట్రయల్ రన్స్ నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇదే వేగంతో పనులు సాగితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ మార్గంలో మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎం.జి.బి.ఎస్. (మహాత్మాగాంధీ బస్ స్టేషన్) వద్ద బారీ ఇంటర్ చేంజ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇక అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఎల్ & టి సంస్థ కృషి చేస్తోంది. రెండు కారిడార్స్ లో సమాంతరంగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఎం.జి.బి.ఎస్.-జె.బి.ఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) కారిడార్ లో కూడా మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి పూర్తయితే రాజధానిలో ఆ చివరి నుంచి ఈ చివరకు మెట్రో రైల్లోనే ప్రయాణాలు చేయడానికి వీలుపడుతుంది.
మెట్రో రూట్ మ్యాప్: