తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు (70) మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన డెంగూ జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. బిపి లెవెల్స్ పెరిగిపోవడంతో అంతర్గత అవయవాలు దెబ్బ తినడంతో అయన పరిస్థితి విషమించింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నించకపోవడంతో నిన్న రాత్రి మృతి చెందారు. అయన అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలో అయన స్వగ్రామం వెంకటరామాపురంలో నిర్వహిస్తామని ఆయన కుమారుడు జగదీశ్ చెప్పారు. తెదేపాలో అయన కాస్త ‘నోరున్న మనిషి’ గా మంచి గుర్తుంపు పొందారు. తెదేపా ప్రత్యర్ధులను ఎదుర్కోవడానికి ఆయనే ఎప్పుడూ ముందుండేవారు. కనుక తెదేపా ఒక బలమైన నాయకుడిని కోల్పోయినట్లయింది.