ఎంతోకాలంగా అరకొర జీతాలతో పనిచేస్తూ ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న ఏ.ఎన్.ఎం.లకు జీతాలను ఒకేసారి రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబందించిన ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సంతకం చేశారు. దీంతో 2003లో నియమితులైన 710 మంది ఏ.ఎన్.ఎం.లకు లబ్ది కలుగుతుంది. ప్రస్తుతం వారు నెలకు రూ.10,000 జీతం అందుకొంటున్నారు. ఇక నుంచి నెలకు రూ.21,000 జీతం అందుకోబోతున్నారు. వారి తరువాత బ్యాచ్ లలో జేరిన వారికి సైతం అదే స్థాయిలో జీతాలు పెంచవలసిందిగా కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దానిపై కూడా తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.