త్వరలో కెసిఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

త్వరలో తెరాస సర్కార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని తాజా సమాచారం. ఎన్నికలకు పార్టీని సన్నధం చేసే ప్రయత్నాలలో భాగంగా పార్టీలో బలమైన నాయకులు కొందరిని మంత్రివర్గంలో తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

హోంమంత్రి నాయ‌ని న‌ర్సింహారెడ్డి, వైద్యఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి చందూలాల్, మరొకరిద్దరూ మంత్రులను వేరే శాఖలకు మార్చవచ్చని సమాచారం. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడానికి కొండా సురేఖ లేదా పద్మా దేవేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తను తెరాస నేతలెవరూ దృవీకరించలేదు ఖండించడం లేదు. కనుక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని భావించవచ్చు.