లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ బుధ, ఆదివారాలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న పార్వతికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆమె పరారిలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలించినప్పటికీ పట్టుకోలేకపోయారు. కానీ ఆమె తన లాయర్ ద్వారా కోర్టులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగలిగింది. సాధారణంగా ఏదైనా కేసులో అరెస్ట్ అయి బెయిల్ పొంది బయటపడిన ప్రముఖులకు శిక్షలు పడటం చాలా అరుదు. గజల్ శ్రీనివాస్ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చేశారు కనుక ఇక ఈ కేసు ఎన్నేళ్ళు సాగుతుందో చూడాలి.