సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు ఇతర న్యాయమూర్తులకు మద్య విభేదాలు నిన్న రచ్చకెక్కడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆచితూచి స్పందించారు. “ అత్యున్నత న్యాయస్థానంలో ఇటువంటి పరిణామాలు జరుగడం చాలా విచారకరం. ప్రెస్ మీట్ లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పిన విషయాలు చాలా ఆందోళన ఆవేదన కలిగించేవిగా ఉన్నాయి. సుప్రీం న్యాయమూర్తులు ఈవిధంగా మీడియా ముందుకు రాలేదు. కనుక దీనిని అసాధారణ చర్యగానే భావించి కేంద్రప్రభుత్వం వారు లేవనెత్తిన సమస్యలను సునిశితంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలి. సొహ్రాబుద్దీన్ కేసును విచారించిన సిబిఐ న్యాయమూర్తి లోహ్రా అనుమానాస్పద మృతిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం సడలకుండా చూడవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉంది. కనుక ఈ వివాదంపై వీలైనంత త్వరగా తగు నిర్ణయం తీసుకొని దీనికి ముగింపు పలకాలి,” అని అన్నారు.