విజయవాడలో కెసిఆర్ కు అభిమానులు!

ఒకప్పుడు రాష్ట్రవిభజనకు కారకుడైన కెసిఆర్ పై ఆంధ్రా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉండేవారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ మూడున్నరేళ్ళలో అయన సమర్ధమైన పాలన, తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును చూసి ఆంధ్రా ప్రజలు కూడా ఇప్పుడు ఆయనను మెచ్చుకొంటున్నారు. అయన పట్ల వారు తమ అభిమానాన్ని అనేక సందర్భాలలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. మళ్ళీ తాజాగా యాదవ యువభేరి ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని మరోసారి చాటుకొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో యాదవుల కోసం యాదవ్ భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పది ఎకరాల భూమిని, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా అయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ, కృష్ణా జిల్లా అధ్యక్షులు బొద్దు రమేష్ యాదవ్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు మేలు చేసినా వారిని మరిచిపోమని చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో యాదవుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంత ఉదారంగా వ్యవహరించినందుకు తమకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు.