తెలంగాణాలో బారీగా బదిలీలు

నూతన సంవత్సరంలో రాష్ట్రంలో మొట్ట మొదటి బదిలీల ప్రక్రియ జరిగింది. అది కూడా చాలా బారీ స్థాయిలో జరుగడం విశేషం. మొత్తం 29 మంది ఉన్నతాధికారులను వేరే శాఖలు, ప్రాంతాలకు బదిలీలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొందరిని మెరుగైన పనితీరు కనబరిచినందుకు కీలకమైన పదవులు కల్పించగా, మరికొందరిని పాలనాపరమైన సంస్కరణలలో భాగంగా వేరే శాఖలు, ప్రాంతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. 

కలెక్టర్లు: 

దేవసేన: పెద్దపల్లి కలెక్టర్‌ 

ఎం.ఆర్.ఎం.రావు: నిజామాబాద్ కలెక్టర్‌

ఒమర్ జలీల్: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ 

అనితా రామచంద్రన్: జనగాం కలెక్టర్‌ (అదనపు బాధ్యతలు)

మాణిక్ రాజు: మెదక్ కలెక్టర్ (అదనపు బాధ్యతలు)

లోకేశ్ కుమార్: మహబూబాబాద్ కలెక్టర్ (అదనపు బాధ్యతలు)

జాయింట్ కలెక్టర్లు: 

అనురాగ్ జయంతి: బోధన్ 

గౌతమ్: మెట్‌పల్లి 

పమేలా సత్పతి: భద్రాచలం

రాహుల్‌రాజ్: బెల్లంపల్లి

ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శులు:

రాజేశ్వర్ తివారి: రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 

శాంతి కుమారి: వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (అదనపు బాధ్యతలు)

బుర్రా వెంకటేశం: బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి (అదనపు బాధ్యతలు)

దాన కిశోర్: మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి (అదనపు బాధ్యతలు)

అరవింద్ కుమార్: పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

సందీప్‌కుమార్ సుల్తానియా: పశుసంవర్ధకశాఖ కార్యదర్శి

జ్యోతి బుద్దప్రకాశ్: ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి 

బి.ఆర్.మీనా: ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి 

సురేష్ చందా: రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి 

కమీషనర్లు:

నవీన్ మిత్తల్: కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌

ఆర్.వి.చంద్రవదన్: విపత్తు నిర్వహణ కమిషనర్‌ 

అనితా రాజేంద్ర: బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌

క్రిస్టినా: గిరిజిన సంక్షేమ కమిషనర్‌ 

ఇలంబర్తి: రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శి

వాకాటీ కరుణ: భూ పరిపాలన సంచాలకులు 

చంపాలాల్: సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శి 

ప్రీతిమీనా: ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులు 

శివకుమార్ నాయుడు: ప్రణాళికా బోర్డు కార్యదర్శి 

అశోక్‌కుమార్: ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ 

కాళీచరణ్: ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డి 

జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లు: భారతి హోళికేరి, సిక్బా పట్నాయక్, ముషారఫ్ అలీ