రాష్ట్రపతి పర్యటన: నేటి షెడ్యూల్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు రాష్ట్రపతి తేనీటి విందునిచ్చారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న విజయవాడ చేరుకొన్నారు. విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ‘ఫైబర్ గ్రిడ్’ పధకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం  2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీకి బయలుదేరుతారు.