బాలీవుడ్‌లో మరో ఆత్మహత్య

August 07, 2020
img

బాలీవుడ్‌లో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ ముంబైలో తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా నిన్న ముంబైలో నివాసం ఉంటున్న ప్రముఖ భోజ్‌పురీ సినీ, టీవీ నటీ అనుపమా పాఠక్ (44) తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. చనిపోయేముందు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దానిలో ‘నేను చాలా మోసపోయాను. ఇప్పుడు నేను ఎవ్వరినీ నమ్మలేని స్థితిలో ఉన్నాను,” అని చెప్పారు. కనుక ఆమె బాలీవుడ్‌లో ఎవరి చేతిలోనో మోసపోయి ఆ ఆవేదనతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

గత నెలరోజులలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్, అంతకు ముందు అతని మేనేజర్ దిశా షాలిని, ఆ తరువాత మరాఠీ నటుడు అశుతోష్ భాక్రే (32), మూడు రోజుల క్రితం హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ (44), ఇప్పుడు అనుపమా పాఠక్ (44) వరుసగా ఆత్మహత్యలు చేసుకొన్నారు. వీరందరూ కూడా చిత్రపరిశ్రమలో మంచి నటులుగా రాణిస్తున్నవారే. అందరూ 35-45 ఏళ్ళలోపువారే. అంత చిన్న వయసులోనే ఆ స్థాయికి వచ్చిన తరువాత ఆత్మహత్యలు చేసుకోవడం గమనిస్తే బాలీవుడ్‌లో తెర వెనుక ఎంత భయానకమైన పరిస్థితులున్నాయో? అనే అనుమానం కలుగకమానదు.     

Related Post