
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫినిషింగ్ కు దగ్గరగా ఉన్న రాధే శ్యాం తో పాటుగా సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇవే కాకుండా బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. బాహుబలి ప్రభాస్ తో ఓ క్రేజీ యాక్షన్ సినిమా ప్లాన్ చేశాడట సిద్ధార్థ్ ఆనంద్.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కత్రినా కైఫ్ అంటే బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్. ఆల్రెడీ ఇక్కడ వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలు చేసింది. చాలా ఏళ్ళ తర్వాత కత్రినా తెలుగు హీరోతో జత కడుతుంది. సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ స్టామినాకు తగినట్టుగా కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.