మరో హిట్ సినిమా రీమేక్ చేస్తున్న బెల్లంకొండ..!

టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ ఎవరు అంటే కచ్చితంగా అందరు చెప్పే పేరు ఒక్కటే విక్టరీ వెంకటేష్. ఆయన రీమేక్ చేశాడు అంటే మాత్రుక సినిమా కన్నా అవుట్ పుట్ అదిరిపోతుంది. సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేస్తూ సేం రిజల్ట్ అందుకోవడంలో వెంకటేష్ స్టైల్ వేరని చెప్పొచ్చు. ఇక ఇదే పంథాని కొనసాగిస్తున్నాడు బెల్లంకొండ హీరో శ్రీనివాస్. అల్లుడు శ్రీను నుండి ఈమధ్య వచ్చిన అల్లుడు అదుర్స్ వరకు ప్రేక్షకులను అలరించాలన్న అతని తపన ఇంప్రెస్ చేస్తుంది.

అందుకే వేరే భాషలో హిట్టైన సినిమాలను తెచ్చి మన దగ్గర రీమేక్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక ఇదే క్రమంలో మరో తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కర్ణన్ సినిమాను తెలుగు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట బెల్లంకొండ బాబు. 

తమిళంలో సూపర్ హిట్టైన కర్ణన్ సినిమా తెలుగులో కూడా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాపై కన్నేశాడు. కర్ణన్ తెలుగు రీమేక్ డైరక్టర్ ఎవరు.. సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.