సరిలేరు నీకెవ్వరు సీక్వల్ వస్తుందా..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా లైన్ లో ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత జక్కన్న కొద్దిపాటి గ్యాప్ తో మహేష్ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ముందే మహేష్ త్రివిక్రం తో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. అంతేకాదు తనకు సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపుడితో కూడా సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.   

F3 షూటింగ్ పూర్తి చేసిన అనీల్ బాలకృష్ణ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే మహేష్ కోసం సరిలేరు నీకెవ్వరు సీక్వల్ కథ సిద్ధం చేశాడట. ఈమధ్యనే మహేష్ కు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి మహేష్ తో అనీల్ మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట కాగానే త్రివిక్రం సినిమా పూర్తి చేసి అనీల్ సినిమాతో పాటుగా రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తాడట మహేష్. అనీల్ రావిపుడి సినిమాను కూడా త్వరగా పూర్తి చేసి జక్కన్న కోసం ఒకటి రెండేళ్లు కేటాయిస్తాడని అంటున్నారు. మరి రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం డేట్స్ ఇవ్వనిదే సినిమా పూర్తవ్వదు కద.