రెండు హిట్లు కొట్టిన డైరక్టర్ మళ్ళీ అసిస్టెంట్ గా మారాడా..?

ఛలో, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల మళ్ళీ అతను అసిస్టెంట్ డైరక్టర్ గా మారాడని తెలుస్తుంది. అదేంటి అసిస్టెంట్ డైరక్టర్ నుండి డైరక్టర్ గా ప్రమోషన్ వచ్చాక మళ్ళీ అసిస్టెంట్ గా చేయరు కదా అదికూడా రెండు హిట్లు ఇచ్చిన డైరక్టర్ కు సినిమా ఛాన్సులు లేకపోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ డైరక్టర్ ను కావాలని స్టార్ హీరో.. స్టార్ డైరక్టర్.. కాంబోకి తీసుకున్నారట. ఇంతకీ ఏంటా స్టార్ కాంబినేషన్ అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ సినిమా అని తెలుస్తుంది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాకు టైం పట్టేలా ఉందని మధ్యలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మహేష్. త్రివిక్రం డైరక్షన్ లో త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో వెంకీ కుడుముల సాయం తీసుకుంటున్నారట. ఆల్రెడీ త్రివిక్రం దగ్గర అసిస్టెంట్ గా చేసిన వెంకీ మళ్ళీ అక్కడ నుండి పిలుపు రావడంతో హ్యాపీగా ఓకే చెప్పాడట. క్రేజీ ప్రాజెక్ట్ కు భాగమవుతున్నందుకు అతను ఖుషీగా ఉన్నాడు. భీష్మ తర్వాత చరణ్ తో సినిమా ప్లాన్ చేసిన వెంకీ అది వర్క్ అవుట్ అవలేదు అనుకుంటా అందుకే మరో సినిమా వచ్చే వరకు మహేష్ సినిమాకు పనిచేయాలని ఫిక్స్ అయ్యాడు. వెంకీ వర్కింగ్ స్టైల్ నచ్చితే మహేష్ సినిమా ఆఫర్ వచ్చినా రావొచ్చు అందుకే అతను అసిస్టెంట్ గా అని ఫీల్ అవకుండా ఓ భారీ సినిమాకు పనిచేస్తున్నాను అన్న భావనలో ఉండి ఉంటాడని అనుకుంటున్నారు.