ఓవర్సీస్ లో రాధే శ్యామ్ క్రేజ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. జూలై 30 రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా బిజినెస్ అదరగొడుతుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న రాధే శ్యామ్ సినిమా ఓవర్సీస్ బిజినెస్ అదిరిపోయిందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమా మూడున్నర నుండి నాలుగు మిలియన్ డాలర్లకు రాధే శ్యామ్ సినిమను కొనేసినట్టు తెలుస్తుంది. 

కరోనా ఓ రేంజ్ లో విజృంభిస్తున్నా సరే ప్రభాస్ సినిమా బిజినెస్ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. జూలై 30 రాధే శ్యామ్ రిలీజ్ అని అంటున్నా ఆ టైం వరకు కరోనా తీవ్రత ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతానికి మే, జూన్ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని వాయిదా బాట పట్టాయి. మరి అదే దారిలో రాధే శ్యామ్ కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా లేక అనుకున్న టైం కు వస్తుందా అన్నది చూడాలి.