
కింగ్ నాగార్జున హీరోగా సినిమాలు చేస్తూనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తుంటారు. యువ హీరోలతో నాగార్జున తన బ్యానర్ లో సినిమాలు చేయడం తెలిసిందే. ఇక సినిమాలతో పాటుగా అన్నపూర్ణ బ్యానర్ లో సీరియల్స్ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటాయి. లేటెస్ట్ గా నాగార్జున సొంత ఓటిటి ఫ్లాట్ ఫామ్ కూడా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు ధీటుగా ఆహా సూపర్ సక్సెస్ అయ్యింది. కంప్లీట్ తెలుగు సినిమాలు, వెబ్ సీరీస్ లతో ఆహా ఓటిటి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అందుకే నాగార్జున కూడా కొత్త ఓటిటిని రెడీ చేయాలని అనుకుంటున్నారట. తన ఓటిటిలో వెబ్ సీరీస్ లతో పాటుగా టాలెంట్ ఉండి ఛాన్సులు రాని వారికి చోటు ఇవ్వాలని చూస్తున్నారట. నాగార్జున చేసే సినిమాలే కాదు తీసుకునే నిర్ణయాలు కూడా కొత్తగా ఉంటాయి. మరి నాగ్ ఓటిటి ఎలా ఉంటుంది. అది కూడా ఆహా లానే కేవలం తెలుగులోనే ఉంటుందా మిగతా వివరాలన్ని త్వరలో తెలుస్తాయి.